dhansika: షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్ ధన్సిక

  • 'కబాలి' సినిమాలో రజనీ కుమార్తెగా నటించిన ధన్సిక
  • 'యోగి డా' చిత్రం షూటింగ్ లో గాయపడ్డ యువనటి
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమాలో ఆయన కుమార్తెగా నటించి, మెప్పించిన నటి ధన్సిక. ఆమె అభినయం, అందం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో 'వాలు జడ' సినిమాతో పాటు, తమిళంలో 'యోగి డా' చిత్రంలో నటిస్తోంది. తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆమె గాయపడింది. బార్ లో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆమె ప్రమాదానికి గురైంది.

వివరాల్లోకి వెళ్తే, యాక్షన్ సన్నివేశం షూటింగ్ లో భాగంగా కొందరు రౌడీలు ధన్సికపై బీర్ బాటిళ్లు విసరాలి. ఈ సన్నివేశం చిత్రీకరిస్తుండగా... పగిలిన గాజు ముక్క ఒకటి ఆమె కంటి కింద భాగంలో గుచ్చుకుంది. గాయపడ్డ ఆమెను యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరిలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన వెంటనే ఆమె... గాయంతోనే తిరిగి షూటింగ్ లో పాల్గొనడం గమనార్హం.

dhansika
accident
shooting
Rajinikanth
kabali
tollywood
kollywood
  • Loading...

More Telugu News