anam ramnarayanareddy: కోవర్టుల సహకారంతో రాహుల్‌ను దెబ్బతీసేందుకు బాబు కుట్ర: ఆనం రామనారాయణరెడ్డి

  • తెలంగాణలో రేవంత్‌, ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి బాబు ఏజెంట్లు
  • ఏపీలో ఎన్నికలు వస్తుండడంతో కిరణ్‌ హడావుడి
  • జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకు లేదు

కోవర్టుల సహకారంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని దెబ్బతీసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. ఇందుకోసం తెలంగాణలో రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఏజెంట్లుగా వాడుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డి తన పాత్ర పోషించి ఫెయిలయ్యారని, ఇప్పుడు ఏపీ ఎన్నికలు వస్తుండడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. ‘చివరి బంతి వరకు...’ అంటూ కాలక్షేపం చేసి పదవి పోగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఇన్నేళ్లుగా ఎక్కడున్నారో తెలియని కిరణ్‌కుమార్‌రెడ్డి మళ్లీ హఠాత్తుగా ప్రత్యక్షమై బాబు కోసం పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌ను విమర్శించే స్థాయి కిరణ్‌కు లేదని తీసిపారేశారు. 

anam ramnarayanareddy
kirankumarreddy
Revanth Reddy
  • Loading...

More Telugu News