Khammam District: అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

  • తాను పార్టీ మారుతున్నానని వచ్చిన వార్తలపై వివరణ
  • ఎవరి ఒత్తిడికీ లొంగవద్దని బాబు భరోసా ఇచ్చారని వెల్లడి
  • తుదిశ్వాస వరకు టీడీపీలో ఉంటానని స్పష్టం

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లిపోతున్నారన్న వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఈ రోజు కలుసుకున్నారు. పార్టీ మారుతున్నానని వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చారు. బాబుతో భేటీ అనంతరం బయటకు వచ్చిన నాగేశ్వరరావు మాట్లాడుతూ తన తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని, పార్టీ మారాలంటూ వచ్చిన ఎటువంటి ఒత్తిడికైనా లొంగవద్దని చంద్రబాబు కూడా భరోసా ఇచ్చారని తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటానని, అమరావతికి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో మా స్వగ్రామం ఉన్నందున ఏ సందర్భంలోనైనా తనను నేరుగా వచ్చి కలవవచ్చని నైతిక ధైర్యం ఇచ్చారని వెల్లడించారు.

Khammam District
aswaraopeta
mcha nageswararao
  • Loading...

More Telugu News