Mahesh Babu: వెబ్-సిరీస్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు!

  • ప్రముఖ సంస్థతో ఒప్పందం
  • వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం
  • మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగిన ప్రిన్స్

ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంతంగా ఏఎంబీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. తాజాగా ఆయన వెబ్-సిరీస్ వ్యాపారంలోకి కూడా రానున్నాడు. ఇందుకోసం ఓ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ తో మహేశ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

హుస్సేన్ అనే దర్శకుడు ఈ సిరీస్ లను తెరకెక్కిస్తాడని సమాచారం. కాగా, ఈ వెబ్ సిరీస్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది. మహేశ్ ఇప్పటికే సొంత నిర్మాణ సంస్థ ‘మహేశ్ బాబు ప్రొడక్షన్స్’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు వంటి సినిమాలకు మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించాడు.

Mahesh Babu
business
web series
launch
2019
january
febuary
  • Loading...

More Telugu News