police: సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య

  • వర్ల రామయ్యపై అనుచిత పోస్టులు
  • విజయవాడ సీపీకి ఫిర్యాదు
  • నిందితుడిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ

సోషల్ మీడియాలో తనపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత, ఏపీ ఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి కులాల పేరుతో తమను దూషించాడంటూ శనివారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని కొందరు ఇటువంటి చర్యలకు దిగుతున్నట్టు చెప్పారు.

సీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా కొందరు బురదజల్లే కార్యక్రమాలకు దిగుతున్నారని, కులాల పేరుతో దూషిస్తున్నారని పేర్కొన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తనకు హామీ ఇచ్చినట్టు వర్ల రామయ్య తెలిపారు.

police
Telugudesam
Varla Ramaiah
Vijayawada
Social Media
  • Loading...

More Telugu News