jagga reddy: టీఆర్ఎస్ లో చేరనున్నారనే వార్తలపై జగ్గారెడ్డి స్పందన

  • కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు
  • మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాం
  • ఓటమికి అందరూ బాధ్యత తీసుకోవాలి

తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఇతర ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారని తాను భావించడం లేదని చెప్పారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఏ ఒక్కరిదో బాధ్యత కాదని... నేతలంతా సమష్టిగా బాధ్యత తీసుకోవాలని తెలిపారు. రాజకీయ విమర్శలకు ఇచ్చినంత ప్రాధాన్యతను... మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇవ్వలేదని చెప్పారు. ఓటమికి కారణాలను సమీక్షించి, పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. 

jagga reddy
TRS
congress
  • Loading...

More Telugu News