dhanush: 'అసురన్'గా ధనుశ్ .. కొత్త పోస్టర్ రిలీజ్

  • నిన్ననే విడుదలైన 'మారి 2'
  • ఈ రోజున వదిలిన 'అసురన్' పోస్టర్ 
  • దర్శకుడిగా వెట్రిమారన్       

తమిళంలో కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే యువకథానాయకులలో ధనుశ్ ముందు వరుసలో కనిపిస్తాడు. కథాకథనాలపై ధనుశ్ కి మంచి పట్టువుంది. అందువలన చకచకా కథలను ఓకే చేసుకుని ఆయన సెట్స్ పైకి వెళ్లిపోతుంటాడు. అలా 'మారి 2'తో నిన్ననే ప్రేక్షకులను పలకరించిన ధనుశ్, ఈ రోజున తన తదుపరి చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను వదిలాడు.

ధనుశ్ తదుపరి చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ధనుశ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందువలన ఈ ఇద్దరూ కలిసి మరోమారు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి 'అసురన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. వి.క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. 

dhanush
vetrimaran
  • Loading...

More Telugu News