USA: సైలెంట్ గా అమెరికాకు వెళ్లిపోయిన రజనీకాంత్.. ఆందోళనలో అభిమానులు!

  • పెట్టా షూటింగ్ తర్వాత అమెరికా పయనం
  • కంగారు పడుతున్న తలైవా అభిమానులు
  • వివరణ ఇచ్చిన రజనీ సన్నిహితవర్గాలు

రోబో 2.ఓ సినిమా విజయంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు మాంచి జోష్ లో ఉన్నారు. తాజాగా రజనీ పెట్టా సినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ సైలెంట్ గా కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. దీంతో ఏమైందోనని ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రజనీ సన్నిహిత వర్గాలు స్పందించాయి. వైద్య పరీక్షల కోసమే రజనీ అమెరికా వెళ్లారని వివరణ ఇచ్చాయి.

గతంలోనూ రజనీ తరచుగా అమెరికాలో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారనీ, కానీ రోబో 2.ఓ షూటింగ్ కారణంగా అది వాయిదా పడటంతో ఇప్పుడు వెళుతున్నారని స్పష్టం చేశాయి. అభిమానులు కంగారు పడాల్సిన విషయం ఏమీలేదని తేల్చిచెప్పారు. వచ్చే ఏడాది జనవరి 10 వరకూ రజనీ అమెరికాలోనే గడపనున్నారు. ఆయన భారత్ కు తిరిగివచ్చాక మురుగదాస్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ 2019, మార్చి నుంచి ప్రారంభం అవుతుంది. 

USA
Rajinikanth
tour
medical checkup
fans
tension
  • Loading...

More Telugu News