pawan kalyan: కుమారుడు శంకర పవనోవిచ్ కోసం కుటుంబంతో కలసి యూరప్ వెళ్లిన పవన్ కల్యాణ్

  • క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు
  • భార్య లెజనోవా కోరిక మేరకు యూరప్ కు పయనం
  • క్రిస్మస్ తర్వాత తిరుగుపయనం

ఇన్నాళ్లు అమెరికాలో బిజీగా గడిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు యూరప్ పర్యటనకు వెళ్లారు. కుటుంబంతో కలసి యూరప్ కు బయల్దేరారు. తన కుమారుడు శంకర పవనోవిచ్ కు క్రిస్టియన్ మతాచారాల ప్రకారం చేయాల్సి ఉన్న కొన్ని లాంఛనాలను ఈ క్రిస్మస్ సందర్భంగా పూర్తి చేద్దామని పవన్ ను ఆయన భార్య అన్నా లెజనోవా కోరారు. ఈ నేపథ్యంలో, కుటుంబంతో కలసి ఆయన బయల్దేరారు. క్రిస్మస్ తర్వాత వారు మళ్లీ హైదరాబాదుకు తిరుగుపయనమవుతారు. యూరప్ పర్యటన తర్వాత అమరావతిలో పార్టీ శ్రేణులకు ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నారు.

pawan kalyan
janasena
europe
family
  • Loading...

More Telugu News