varun tej: బాక్సర్ గా కనిపించనున్న మెగా హీరో!

  • థియేటర్లకు వచ్చిన 'అంతరిక్షం'
  • విడుదలకి ముస్తాబవుతోన్న 'ఎఫ్ 2'
  • అల్లు బాబీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్      

వరుణ్ తేజ్ తాజా చిత్రంగా 'అంతరిక్షం' నిన్ననే థియేటర్లకి వచ్చింది. ఆయన తదుపరి చిత్రమైన 'ఎఫ్ 2' సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే వరుణ్ తేజ్ మరోకొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించాడు.

ఈ బ్యానర్లో నిర్మించనున్న తొలి చిత్రానికి కథానాయకుడిగా వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. కొత్త లుక్ తో వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపిస్తాడని అంటున్నారు. కిరణ్ అనే కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. 'కంచె' .. 'అంతరిక్షం' మాదిరిగానే వరుణ్ తేజ్ కెరియర్లో ఈ సినిమా విభిన్నమైనదిగా నిలిచిపోతుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. 

  • Loading...

More Telugu News