Telangana: శామీర్ పేట రేవ్ పార్టీలో కొత్త ట్విస్ట్.. అమ్మాయిలను సప్లై చేసిన ఫార్మా కంపెనీ!

  • అమ్మకాలను పెంచుకునేందుకు ఎత్తుగడ
  • 11 మంది డాక్టర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నలుగురు యువతులు స్టేట్ హోంకు తరలింపు

తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో ఉన్న సెలబ్రిటీ రిసార్ట్ లో రేవ్ పార్టీని ఈరోజు తెలంగాణ ఎస్ వోటీ పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 11 మంది డాక్టర్లతో పాటు నలుగురు యువతులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం యువతులను స్టేట్ హోంకు తరలించారు. కాగా, ఈ వ్యవహారంపై మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ డాక్టర్ల కోసం శామీర్ పేటలోని రిసార్ట్ లో ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వైద్యులను ప్రసన్నం చేసుకుని తమ మందుల అమ్మకాలను పెంచుకోవడం కోసమే అమ్మాయిలను సప్లై చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ వ్యవహారం వెనుక ఉన్న కంపెనీ పేరును మాత్రం పోలీస్ అధికారులు బయటపెట్టలేదు. అయితే అరెస్టయిన 11 మంది వైద్యులు గజ్వేల్ కు చెందినవారేనని పోలీసులు స్పష్టం చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News