anna hazare: మరోసారి నిరాహారదీక్షకు సిద్ధమైన అన్నా హజారే

  • జనవరి 30 నుంచి రాలేగావ్ సిద్ధిలో నిరాహారదీక్ష
  • లోక్ పాల్, లోకాయుక్తలను నియమించాలని డిమాండ్
  • కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలపై మండిపాటు

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహారదీక్షకు సిద్ధమవుతున్నారు. జనవరి 30న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో ఆయన నిరశన దీక్షను చేపట్టనున్నారు. లోకాయుక్త చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దీక్షకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు ఆయన లేఖ రాశారు. లోక్ పాల్ మరియు లోకాయుక్త చట్టం 2014ను అమలు చేస్తామని చెప్పిన మహారాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలు కాలేదని, హామీలుగానే మిగిలిపోయాయని లేఖలో ఆయన ఆరోపించారు.

ఇదే అంశంపై ఈ నెల ప్రారంభంలో అన్నా హజారే మాట్లాడుతూ, మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయిందని... కానీ, ఇంత వరకు లోక్ పాల్, లోకాయుక్తలను ఆయన నియమించలేదని మండిపడ్డారు. లోక్ పాల్, లోకాయుక్తలను నియమించాలన్న ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని దుయ్యబట్టారు.

anna hazare
ralegan siddhi
fast
lokayuka
lokpal
devendra fadnavis
Narendra Modi
  • Loading...

More Telugu News