prabhas: ప్రభాస్ ప్రేమకథ 1960 కాలం నాటిదట!

  • దర్శకుడు రాధాకృష్ణతో ప్రభాస్ 
  • ప్రేమకథ నేపథ్యంలో సాగే చిత్రం  
  • ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అనుష్క

ప్రస్తుతం ప్రభాస్ .. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' .. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంతవరకూ ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్పడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. ఇది 1960ల కాలం నాటి అద్భుతమైన ప్రేమకథ అనే విషయం తాజాగా బయటికి రావడంతో అందరిలో మరింతగా ఆత్రుత పెరిగిపోతోంది.

ఈ ప్రేమకథ గురించిన అప్డేట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రాధాకృష్ణ "ప్రభాస్ అభిమానులు .. తొందరపడకండి. అన్ని ఆసక్తికరమైన విశేషాలను సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాము" అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీమంతుడిగా .. పాతకాలం నాటి కార్లను ఇష్టపడే వ్యక్తిగా కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే కనిపించనుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో కథానాయిక ఉంటుందనీ, ఆ పాత్ర కోసం అనుష్కను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. 

  • Loading...

More Telugu News