Odisha: రైతు బంధులాంటి పథకాన్ని ప్రకటించిన ఒడిశా.. మేకలు, గొర్రెల పెంపకం కూడా!

  • సీఎం కర్షక్ అసిస్టెంట్ పథకాన్ని ప్రకటించిన నవీన్ పట్నాయక్
  • ఒక్కో రైతుకు రూ. 10 వేలు పంపిణీ
  • భూమిలేని పేదలకు రూ. 12,500లతో ఉపాధి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బంధులాంటి పథకాన్నే ఒడిశా ప్రభుత్వం కూడా అమలు చేయనుంది. సీఎం కర్షక్ అసిస్టెంట్ పేరిట పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు కొనేందుకు ఒక్కో రైతుకు రూ. 10 వేలను అందజేస్తామని ఆయన తెలిపారు. దీని కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ. 10,180 కోట్లను కేటాయిస్తామని చెప్పారు. దీంతో పాటు ఒక్కొక్క రైతుకు వడ్డీ లేకుండా రూ. 50 వేల రుణాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. వ్యవసాయ భూమి లేని పేదలకు మేకలు, గొర్రెల పెంపకం, పుట్టగొడుగుల సాగు కోసం ఒక్కొక్కరికి రూ. 12,500లను అందించి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 

  • Loading...

More Telugu News