Telangana: మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీకి తీవ్ర అస్వస్థత.. అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరిక!

  • కడుపునొప్పితో బాధపడుతున్న ఎమ్మెల్యే
  • ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వెల్లడి
  • చాంద్రాయణ గుట్ట నుంచి గెలుపొందిన అక్బర్

తెలంగాణ ఎమ్మెల్యే, మజ్లిస్ పార్టీ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అస్వస్థతకు లోనయ్యారు. నిన్న రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్బర్ కు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో తీవ్రంగా ఇబ్బందిపడ్డ ఆయన్ను సన్నిహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణ గుట్ట నుంచి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఇటీవల ఓ సందర్భంగా ఒవైసీ మాట్లాడుతూ.. ‘కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా. నా కిడ్నీలు పూర్తిగా పాడయిపోయాయి. కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఇంకా ఉన్నాయి. కొన్ని రోజుల కిందట పరిస్థితి చేయి దాటి పోయింది. డాక్టర్ నన్ను డయాలసిస్ చేసుకోమన్నారు. ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’  అని వ్యాఖ్యానించారు.

Telangana
majlis
Akbaruddin Owaisi
sick
ill
hospital
stomach pain
Telangana Assembly Results
  • Loading...

More Telugu News