weather repor: నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడన ద్రోణి

  • నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వర్ష సూచన
  • ఉత్తరాది నుంచి పెరిగిన చలిగాలుల ప్రభావం
  • పగటిపూట కూడా తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి

నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. సముద్రమట్టానికి దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తున ఈ ఉపరితల ద్రోణి ఏర్పడి స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ద్రోణి కారణంగా తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణకోస్తా ప్రాంతానికి చలిగాలుల తీవ్రత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. కోస్తాంధ్రలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువ నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం స్థిరంగా ఉంటున్నాయి.

రానున్న రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తరాదిలో చలి తీవ్రత పెరగడం, అటు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం కూడా  కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉండడానికి కారణమని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో శని, ఆదివారం పొడి వాతావరణం ఉంటుంది. ఇటీవలే పెథాయ్‌ తుపాన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వణికించి వెళ్లింది. వరి కోతల సమయంలో గాలులు, వర్షాలు విరుచుకుపడడంతో అన్నదాతకు తీవ్రనష్టం వాటిల్లింది. రెండు రోజుల నుంచి ఎండ కాస్తుండడంతో రైతులు కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

weather repor
lowpresure in bay of bengal
  • Loading...

More Telugu News