Tollywood: పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేసిన బంధువుపై సినీ నటి తారా చౌదరి కేసు.. అరెస్ట్!

  • పెళ్లి పేరుతో విజయవాడ తీసుకెళ్లిన రాజ్‌కుమార్
  • స్థల విక్రయానికి నో చెప్పిన తారా చౌదరి
  • పెళ్లి వాయిదా వేసిన నిందితుడు

నటి తారా చౌదరి ఫిర్యాదుపై ఆమె సమీప బంధువు చావ రాజ్‌కుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రెండేళ్ల క్రితం సమీప బంధువైన రాజ్‌కుమార్‌తో తారా చౌదరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ముదరడంతో వివాహం చేసుకుంటానని నమ్మించిన రాజ్‌కుమార్ ఆమెను విజయవాడ తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లాక ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, డబ్బులు సర్దుబాటు చేయాలని కోరాడు. ఆమె పేరిట ఉన్న స్థలాన్ని విక్రయించాల్సిందిగా కోరాడు.

స్థలం అమ్మేందుకు తారా చౌదరి నిరాకరించింది. దీంతో పెళ్లిని వాయిదా వేసిన రాజ్‌కుమార్ తమ మకాంను హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీకి మార్చాడు. ఈ క్రమంలో తారా చౌదరి పలుమార్లు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ముఖం చాటేశాడు. దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్ల నుంచి తనను మోసం చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tollywood
Tara choudary
Chava Raj kumar
Vijayawada
Hyderabad
Banjara hills
  • Loading...

More Telugu News