NTR: సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘యన్.టి.ఆర్’ ట్రైలర్!

  • ఎన్టీఆర్ పాత్రలో ఒదిగిపోయిన బాలయ్య
  • అంచనాలు పెంచేస్తున్న ట్రైలర్
  • విడుదలైన కాసేపటికే పది లక్షల వ్యూస్

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘యన్.టి.ఆర్’ ట్రైలర్ వచ్చేసింది. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ఆడియో వేడుకలో విడుదల చేశారు. ఎన్టీఆర్ నలుగురు కుమార్తెలు కలిసి దీనిని విడుదల చేశారు.

ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన కాసేపటికే పది లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారు. అచ్చం ఎన్టీఆర్‌ను తలపించారు. నాటి తరం వారు ఎవరైనా ఈ ట్రైలర్‌ను చూస్తే ఎన్టీఆరే అని భావించకమానరు. ఎన్టీఆర్‌గా బాలయ్య బ్రహ్మాండంగా కుదిరారనిపిస్తుంది.

ఈ సినిమా ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అనే రెండు భాగాలుగా వస్తోంది. అయితే, రెండు సినిమాలకు కలిపి ఒకే ట్రైలర్‌ను డిజైన్ చేయడం విశేషం. మోహన్‌బాబు, రానా దగ్గుబాటి, నందమూరి కల్యాణ్ రామ్, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ, నిత్యామీనన్ తదితరులు నటించిన ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు. కీరవాణి సంగీతం సమకూర్చారు.

NTR
Balakrishna
Director krish
Tollywood
NTR Trailer
NTR Biopic
  • Error fetching data: Network response was not ok

More Telugu News