President Of India: హైదరాబాద్ లో శీతాకాల విడిది.. రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం

  • హకీం పేట విమానాశ్రయంలో కోవింద్ కు ఘనస్వాగతం
  • నేటి నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రపతి శీతాకాల విడిది
  • ఈ నెల 23న ‘ఎట్ హోం’ కార్యక్రమం

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది నిమిత్తం ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. హకీం పేట విమానాశ్రయంలో రామ్ నాథ్ కోవింద్ కు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ లు ఘన స్వాగతం పలికారు. నేటి నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రపతి శీతాకాల విడిది కొనసాగనుంది. ఈ నెల 23న ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. విడిది పూర్తయిన అనంతరం 24న ఢిల్లీ బయలుదేరి వెళతారు. కాగా, బొల్లారంలో రాష్ట్రపతి నిలయానికి రామ్ నాథ్ కోవింద్ చేరుకున్నారు. 

President Of India
ram nath kovind
governer
kcr
  • Loading...

More Telugu News