NTR: చిన్నప్పటి నుంచి నేను ఎన్టీఆర్ అభిమానిని: సూపర్ స్టార్ కృష్ణ

  • డిగ్రీ పూర్తయ్యాక ఎన్టీఆర్ ని చూసేందుకు మద్రాసు వెళ్లా
  • ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పా 
  • మీ సినిమాల్లో ఏదైనా అవకాశమివ్వమని కోరా

ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణ, అచ్చం ఎన్టీఆర్ లానే ఉన్నారని సూపర్ స్టార్ కృష్ణ ప్రశంసించారు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి తాను ఎన్టీఆర్ అభిమానినని, డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ని చూడాలని భావించి మద్రాసు వెళ్లి ఆయన్ని కలిశానని చెప్పారు.

ఆయనని కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పానని, సినిమాల్లో నటించే ఆసక్తి ఉందని, మీ సినిమాల్లో ఏదైనా అవకాశమివ్వమని ఎన్టీఆర్ ని కోరిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఇంకా చిన్న కుర్రాడిలా ఉన్నావు, రెండు మూడేళ్లు ఆగితే కచ్చితంగా నువ్వు పనికొస్తావు అన్నారు. వేషం ఇస్తానని చెప్పారు’ అని గుర్తుచేసుకున్నారు.

ఎన్టీఆర్ తో కలిసి తనకు నటించే అవకాశం 'స్త్రీ జన్మ' చిత్రం ద్వారా తొలిసారిగా లభించిందని చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్ కు చెందిన రెండు భాగాలు అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. బాలకృష్ణకు ఈ చిత్రం గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని చెప్పారు.

NTR
super star Krishna
Balakrishna
audio release
  • Loading...

More Telugu News