NTR biopic: ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ విడుదల.. మెరిసిపోయిన బాలయ్య!

  • ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక
  • ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్ కుమార్తెలు
  • వేడుకకు హాజరైన నందమూరి కుటుంబసభ్యులు 

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ప్రారంభమైన ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ, బాలీవుడ్ నటి విద్యా బాలన్, దర్శకుడు క్రిష్, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నందమూరి కుటుంబసభ్యులు తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను ఈ బయోపిక్ లో పోషిస్తున్న బాలకృష్ణ పట్టువస్త్రాల్లో మెరిసిపోయారు. ఈ చిత్రం ట్రైలర్ ను ఎన్టీఆర్ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమా మహేశ్వరి ఆవిష్కరించారు.

NTR biopic
trailer
NBK
super star krishna
krishnam raju
mohan babu
purandeswari
  • Error fetching data: Network response was not ok

More Telugu News