ponguleti sudhakar reddy: కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి: పొంగులేటి

  • వైఫల్యంపై సమీక్ష నిర్వహించాలి
  • భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలి
  • కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే బాధ్యత సీనియర్లపై ఉంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. పార్టీలోని మహామహులు కూడా ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీని అన్ని స్థాయుల్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇప్పటికే ఓటమిపై హైకమాండ్ కు నివేదిక ఇచ్చామని తెలిపారు. వైఫల్యాలపై సమీక్ష నిర్వహించాలని, ఓటమికి కారణాలు వెతికి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపే బాధ్యత పార్టీ సీనియర్లు అని చెప్పుకుంటున్న వారిపై ఉందని అన్నారు. కీలక బాధ్యతల్లో ఉన్న నాయకులు ఎన్నికల సమయంలో సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారని చెప్పారు.

ponguleti sudhakar reddy
congress
telangana
  • Loading...

More Telugu News