putin: 66 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్న రష్యా అధ్యక్షుడు!

  • త్వరలోనే వివాహం చేసుకునే అవకాశం ఉందన్న పుతిన్
  • 2013లో విడాకులు తీసుకున్న ల్యూడ్మిలా-పుతిన్ జంట
  • పుతిన్ వ్యక్తిగత జీవితంపై పలు పుకార్లు

రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. త్వరలోనే తాను వివాహం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. వార్షిక మీడియా సమావేశంలో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. అయితే, ఎవరిని పెళ్లాడబోతున్నారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. 66 ఏళ్ల వయసులో పుతిన్ మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నారన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

1983లో ల్యూడ్మిలాను పుతిన్ పెళ్లాడారు. 2013లో వీరు విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి... పుతిన్ వ్యక్తిగత జీవితంపై పలు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఒలింపిక్స్ మాజీ జిమ్నాస్ట్ అలీనా కబేవాతో పుతిన్ సన్నిహితంగా ఉన్నారని ఓ రష్యన్ పత్రిక ప్రచురించింది. అయితే, ఈ కథనాన్ని ఆయన ఖండించారు.

putin
russia
president
marriage
  • Loading...

More Telugu News