agrigold: అగ్రిగోల్డ్ కేసు.. హాయ్ ల్యాండ్ కనీస ధరను ఖరారు చేసిన హైకోర్టు

  • హాయ్ ల్యాండ్ ను వేలం వేయాలంటూ ఎస్టీఐకి ఆదేశం
  • కనీస ధర రూ. 600 కోట్లుగా ఖరారు
  • ఫిబ్రవరి 8న బిడ్డర్ల వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశం

అగ్రిగోల్డ్ కేసును ఈరోజు హైకోర్టు విచారించింది. హాయ్ ల్యాండ్ ను వేలం వేయాలని ఎస్బీఐని ఆదేశించింది. కనీస ధరను రూ. 600 కోట్లుగా ఖరారు చేసింది. బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8న సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. మరోవైపు, అగ్రిగోల్డ్ ఆస్తులను తాము కొనలేమని జీఎస్ఎల్ గ్రూప్ తెలిపింది. జీఎస్ఎల్ గ్రూపు ప్రతిపాదన ఉపసంహరణకు హైకోర్టు ఓకే చెప్పింది. గ్రూపు డిపాజిట్ చేసిన రూ. 10 కోట్లలో రూ. 7 కోట్లు మాత్రమే వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

agrigold
hailand
high court
auction
sbi
  • Loading...

More Telugu News