samanta: సమంతకి కొడుకు పాత్రలో రావు రమేశ్!

- కొరియన్ మూవీగా 'మిస్ గ్రానీ'
- తెలుగు రీమేక్ టైటిల్ గా 'ఓ బేబీ'
- వృద్ధురాలి పాత్రలో సమంత
ఇటీవల కాలంలో విభిన్నమైన కథలు .. నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలనే సమంత ఎంచుకుంటూ వస్తోంది. తాజాగా ఆమె వైవిధ్యభరితమైన మరో కథలో కనిపించడానికి సిద్ధమవుతోంది. సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. కొరియన్ భాషలో తెరకెక్కిన 'మిస్ గ్రానీ' సినిమాకి ఇది రీమేక్. తెలుగులో ఈ సినిమాకి 'ఓ బేబీ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
