Andhra Pradesh: ప్రజాసంకల్పయాత్రలో నడుస్తూనే ‘యాత్ర’ సినిమా టీజర్ చూసిన జగన్.. వైరల్ గా మారిన వీడియో!

  • శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర
  • వైఎస్ పాత్రలో నటించిన మమ్ముట్టి
  • 2019, ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 327వ రోజు పాదయాత్రలో భాగంగా జగన్ టెక్కలి నియోజకవర్గంలోని దండుగోపాలపురం, కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్ వరకూ నడవనున్నారు. కాగా, ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న జగన్ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ‘పాదయాత్ర’ ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమా టీజర్ ను వీక్షించారు.

రోడ్డుపై నడుస్తూనే హెడ్ ఫోన్స్ పెట్టుకుని యాత్ర టీజర్ ను ట్యాబ్ ద్వారా వీక్షించారు. యాత్ర సినిమాలో వైఎస్ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, యాత్ర సినిమా టీజర్ ను జగన్ వీక్షిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీన్ని మీరూ చూసేయండి.

Andhra Pradesh
Telangana
prajasankalpa yatra
Jagan
YSRCP
Viral Videos
2019 feb 08
teaser
yatra movie
  • Error fetching data: Network response was not ok

More Telugu News