Andhra Pradesh: థాంక్యూ కవితమ్మా.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై స్పందించిన జగన్!

  • శ్రీకాకుళం జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర
  • కవిత అభినందనలకు జవాబిచ్చిన జగన్
  • దామోదరపురం వరకూ సాగనున్న పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ తన పుట్టిన రోజును ప్రజాసంకల్ప యాత్రలో అభిమానుల మధ్య జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో జగన్ 327వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. ఈరోజు పాదయాత్రలో భాగంగా దండుగోపాలపురం నుంచి కాశీపురం, దామోదరపురం క్రాస్ వరకూ జగన్ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో జగన్ కు టీఆర్ఎస్ నేత నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ విషయమై జగన్ వెంటనే స్పందించారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు కవితమ్మా’ అని ట్వీట్ చేశారు. అలాగే బర్త్ డే విషెస్ చెప్పిన మమతా బెనర్జీకి ధ్యాంక్యూ దీదీ(అక్కా) అంటూ జవాబిచ్చారు. ఈరోజు మధ్యాహ్నం నాటికి జగన్ పాదయాత్రలో భాగంగా 3,949 కిలోమీటర్లు నడిచారు.

Andhra Pradesh
Jagan
prajasankalpa yatra
Srikakulam District
K Kavitha
TRS
mamata benerji
tmc
West Bengal
birthday wishes
Twitter
  • Loading...

More Telugu News