Jagan: జగన్ అన్నా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు!: కల్వకుంట్ల కవిత

  • ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత
  • శ్రీకాకుళం జిల్లాలో జగన్ ప్రజాసంకల్పయాత్ర
  • 3,949 కిలోమీటర్లు నడిచిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కు టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘జగనన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. జగన్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. 327వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ దండుగోపాలపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్ వరకూ సాగనుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటివరకూ జగన్ 3,949 కిలోమీటర్లు నడిచారు.

Jagan
YSRCP
birthday
Twitter
TRS
K Kavitha
prajasankalpayatra
  • Loading...

More Telugu News