pinnelli ramakrishna reddy: ధర్నాకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

  • గురజాల డీఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా
  • వైసీపీ నేత నరసింహారావుపై అక్రమ కేసు పెట్టారని మండిపాటు
  • వెంటనే విడుదల చేయాలని డిమాండ్

గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ కార్యాలయం వద్ద మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధర్నాకు దిగారు. వైసీపీ నేత నరసింహారావుపై అక్రమంగా బాంబుల కేసు పెట్టారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. టీడీపీకి చెందిన వ్యక్తులే నరసింహారావు కారు కింద బాంబులు పెట్టారని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసింహారావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

pinnelli ramakrishna reddy
macharla
YSRCP
mla
gurajala
dharna
bomb
  • Loading...

More Telugu News