trap: ఉపాధి కల్పిస్తామంటూ విదేశీ యువతులకు ట్రాప్.. వ్యభిచారంలోకి దింపుతున్న హైదరాబాద్ జంట!

  • హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఘటన
  • బంగ్లాదేశ్ నుంచి యువతుల రాక
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

విదేశాలకు చెందిన అమ్మాయిలకు మంచి ఉద్యోగం కల్పిస్తానని వాళ్ల తల్లిదండ్రులను నమ్మిస్తాడు. చివరికి అమ్మాయిలను భారత్ కు తీసుకొచ్చి అమ్మేస్తాడు. అయితే ఈ దుర్మార్గుడి బారి నుంచి తప్పించుకున్న ఓ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నగరంలోని రాజేంద్రనగర్ హకీం హైట్స్‌కు చెందిన సర్ఫరాజ్‌(26), ముష్కిన్ భార్యాభర్తలు. ఈ ఏడాది అక్టోబర్ లో బంగ్లాదేశ్ కు వెళ్లిన సర్ఫరాజ్ దంపతులు బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని అక్కడే ఓ కుటుంబాన్ని నమ్మించారు. అనంతరం అదే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లను నగరానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఓ యువతిని పూణేకు చెందిన అనిరుధ్ అనే వ్యక్తికి అమ్మేశారు. మరో యువతిని హకీం హైట్స్ ప్రాంతానికి తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

అయితే నిందితుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు సోదరిని కూడా ఇలాగే తీసుకొచ్చారని వివరించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సర్ఫరాజ్ ను అరెస్ట్ చేశారు. బాధితురాలిని స్టేట్ హోంకు తరలించారు. సర్ఫరాజ్ చేత అనిరుధ్ కు ఫోన్ చేయించగా, ఆమె తన దగ్గర నుంచి పారిపోయిందని అతను జవాబిచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

trap
Hyderabad
Telangana
Police
prostitution
wife and husband
susupect couple
arrest
  • Loading...

More Telugu News