avanthi srinivas: విభజన హామీలు నెరవేర్చకుండా మోదీ రాకను ఏపీ ప్రజలు స్వాగతించరు : ఎంపీ అవంతి శ్రీనివాస్‌

  • హామీలు అమలు చేశాకే ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టాలి
  • ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే విశ్వసించరు
  • చిత్తశుద్ధి ఉంటే మోదీని రాష్ట్ర బీజేపీ నేతలు నిలదీయాలి

విభజన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించినా ప్రజలు స్వాగతించరని, హామీలు అమలు చేశాకే ఆయన రాష్ట్రానికి రావాలని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు కోరారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరులో జనవరి 6వ తేదీన మోదీ బహిరంగ సభ జరగనున్న సమయంలో ఎంపీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రానికి వచ్చి జనం ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి మభ్యపెట్టాలని చూస్తే రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీలో పర్యటిస్తే ప్రజలు అంగీకరించరన్నారు. ఏపీ బీజేపీ నేతలు ప్రగల్బాలు పలకకుండా రాష్ట్రంపై చిత్తశుద్ధి ఉంటే హామీలపై మోదీని నిలదీయాలని ఆయన కోరారు.

avanthi srinivas
Narendra Modi
ap tour
  • Loading...

More Telugu News