YSRCP: పుట్టినరోజు నాడు వెల్లువెత్తిన అభిమానం.. జగన్ చేత కుమార్తెకు అన్నప్రాసన చేయించిన అభిమాని!

  • శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఘటన
  • ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్న జగన్
  • చిన్నారిని ఆశీర్వదించిన వైసీపీ అధినేత

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గంలో కొనసాగుతోంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకూ 3,949 కిలోమీటర్లు నడిచారు. తాజాగా ఈరోజు తన పుట్టిన రోజు వేడుకలను జగన్ పార్టీ నేతల మధ్య జరుపుకున్నారు. మరోవైపు వైసీపీ అభిమానులు జగన్ పుట్టినరోజున తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు.

దండుగోపాలపురం నుంచి పాదయాత్ర ప్రారంభమైన వేళ ఓ మహిళా అభిమాని తమ కుమార్తెకు జగన్ చేత అన్నప్రాసన చేయించారు. ఈ సందర్భంగా చిన్నారి పాప ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని జగన్ ఆశీర్వదించారు. అలాగే మరో ఇద్దరు వైసీపీ అభిమానులు జగన్ చేత తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. జగన్ పాదయాత్ర దండుగోపాలపురం నుంచి కాశీపురం మీదుగా దామోదరపురం క్రాస్ వరకూ సాగనుంది.

YSRCP
Jagan
Andhra Pradesh
prajasankalpa yatra
birthday
kid
wishes
  • Loading...

More Telugu News