Andhra Pradesh: నేడు నారా బ్రాహ్మణి పుట్టిన రోజు.. రొమాంటిక్ గా శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్!

  • బ్రాహ్మణి పరిపూర్ణత్వానికి మరో రూపం
  • నిన్ను అమితంగా ప్రేమిస్తున్నా
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మంత్రి

హెరిటేజ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ మంత్రి, ఆమె భర్త నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. బ్రాహ్మణి పరిపూర్ణత్వానికి మరో రూపమని లోకేశ్ కితాబిచ్చారు. ఈరోజు ట్వీట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘ఈ ప్రపంచంలో ఏదీ పరిపూర్ణంగా ఉండదని ప్రజలు చెబుతుంటారు. కానీ వాళ్లంతా నిన్ను(బ్రాహ్మణి) చూడలేదు. హ్యాపీ బర్త్ డే నారా బ్రాహ్మణి! నిన్ను అమితంగా ప్రేమిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ లతో కలిసి ఉన్న ఫొటోను ఈ ట్వీట్ కు జత చేశారు.

Andhra Pradesh
Nara Lokesh
nara brahmini
birthday
wishes'
romantic
Twitter
  • Loading...

More Telugu News