Srikakulam District: శ్రీకాకుళంలో జగన్ పుట్టినరోజు వేడుకలు.. భారీ కేక్ ను కట్ చేసిన వైసీపీ అధినేత!

  • టెక్కలిలో మొదలైన ప్రజాసంకల్పయాత్ర
  • ప్రజలను కలుసుకుంటూ ముందుకెళుతున్న జగన్
  • దామోదరపురం  మీదుగా సాగనున్న పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ చీఫ్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టెక్కలి నియోజకవర్గంలోని దండుగోపాలపురం నుంచి 327వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ఈ రోజు ప్రారంభమయింది. పాదయాత్రలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. దండుగోపాలపురం నుంచి మొదలయిన పాదయాత్ర కాశీపురం మీదుగా, దామోదరపురం క్రాస్ వరకూ సాగనుంది.

మరోవైపు ఈ రోజు జగన్ తన పుట్టిన రోజును అభిమానులు, కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు దండుగోపాలపురంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను జగన్ కట్ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు జగన్ కు ఆశీర్వచనం ఇచ్చారు. కాగా, పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోని వైసీపీ కార్యాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Srikakulam District
Jagan
Andhra Pradesh
Telangana
birthday
prajasankalpa yatra
YSRCP
cake
cut
  • Loading...

More Telugu News