Dokka Manikya varaprasad: జాంబవంతుడు మా సామాజిక వర్గం వాడే: డొక్కా మాణిక్య వరప్రసాద్

  • ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న డొక్కా
  • జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు కృషి
  • జాంబవంతుడు మాకు గర్వకారణం

జాంబవంతుడు తమ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం తమకు గర్వకారణమని ఏపీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఆంధ్రా అయోధ్యగా పేరుగాంచిన కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరాముని ఆలయాన్ని గురువారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఒంటిమిట్ట కోదండరాముని ఆలయంలో జాంబవంతుడి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన జాంబవంతుడి విగ్రహం ప్రతిష్ఠించడం అన్నది తమ సామాజిక వర్గం చేసుకున్న పూర్వ జన్మ సుకృతమవుతుందన్నారు.

Dokka Manikya varaprasad
Telugudesam
vontimitta
Kadapa
Lord Rama
Jambavanta
  • Loading...

More Telugu News