Asaduddin Owaisi: వందమంది ఒవైసీలు వచ్చినా మాకు చంద్రబాబు ఒక్కరు చాలు: అసద్‌కు కౌంటర్ ఇచ్చిన జలీల్ ఖాన్

  • అసదుద్దీన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జలీల్ ఖాన్
  • ఎంఐఎం హైదరాబాద్‌కే పరిమితం
  • ‘జయహో బీసీ’పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ వచ్చి వైసీపీ అధినేత  జగన్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తానన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మండిపడ్డారు. వందమంది ఒవైసీలు వచ్చినా ఏమీ చేయలేరని, ఆయనను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఒక్కరు చాలని అన్నారు. హైదరాబాద్‌లోని ఐదు స్థానాలకే ఎంఐఎం పరిమితమని అన్నారు. ఏపీలో ఒవైసీని పట్టించుకునేవారు ఎవరూ లేరని అన్నారు. మహారాష్ట్ర, బీహార్‌లలో ఏమైందో మర్చిపోవద్దని ఒవైసీకి సూచించారు.

ఏపీలో మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే టీడీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. ఇన్నాళ్లు వ్యాపారాలు, కాలక్షేపం చేసింది చాలని, ఇకపై ఎన్నికల కోసమే పనిచేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 30న రాజమండ్రిలో ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విజయవాడ పాతబస్తీలోని మాడపాటి క్లబ్‌లో జలీల్ ఖాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Asaduddin Owaisi
Jaleel khan
Andhra Pradesh
Hyderabad
Telugudesam
Jai ho BC
  • Loading...

More Telugu News