Telangana: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 10 లోపే: తెలంగాణ ఈసీ నాగిరెడ్డి

  • మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తాం
  • ఒక్కో విడతకు మధ్య నాలుగు రోజుల సమయం  
  • నోటిఫికేషన్ వెలువడ్డాక 15 రోజుల్లోనే మొదటి విడత పోలింగ్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై కసరత్తు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జనవరి 10వ తేదీ లోపే ఈ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నట్టు చెప్పారు.

నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత 23 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని, మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఒక్కో విడతకు మధ్య నాలుగు రోజుల సమయం ఉంటుందని, నోటిఫికేషన్ వెలువడ్డ తర్వాత పదిహేను రోజుల్లోనే మొదటి విడత పోలింగ్ ఉంటుందని వివరించారు. రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కోర్టును కొంత సమయం కోరామని, ఆ తర్వాత కూడా చట్ట ప్రకారం ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నెల 27 నుంచి జనవరి 2 మధ్యలో ప్రిసైడింగ్ అధికారులకు, సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తామని అన్నారు. 

Telangana
panchayati elections
ec nagireddy
High Court
  • Loading...

More Telugu News