hanuma: హనుమాన్ ఓ ముస్లిం.. ఆ పేర్లన్నీ ఆయన నుంచే వచ్చాయి!: యూపీ బీజేపీ నేత బుక్కల్

  • హనుమాన్ ‘ముస్లిం’ అని బలంగా నమ్ముతా
  • ‘రెహ్మాన్, ఫర్మాన్ ..’ పేర్లు ఆ పేరు నుంచే వచ్చాయి
  • ‘హనుమాన్’ లేకుంటే ఈ పేర్లే ఉండేవి కావు

రామభక్త హనుమాన్ దళితుడంటూ యూపీ సీఎం, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరిచిపోకముందే ఆ రాష్ట్రానికి చెందిన మరో బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ ‘ముస్లిం’ అని తాను బలంగా నమ్ముతానని బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ వ్యాఖ్యానించారు.

అలా ఎందుకు చెబుతున్నానంటే, ముస్లిం మతస్థుల పేర్లన్నీ దాదాపు హనుమాన్ పేరుకి దగ్గరగా ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందుకు ఉదాహరణగా కొన్ని పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. ‘రెహ్మాన్, ఫర్మాన్, జీషాన్, సులేమాన్..’ వంటి పేర్లను పేర్లను ఉదహరించారు. ఈ పేర్లన్నీ హనుమాన్ నుంచే వచ్చాయని, ఆయన కనుక లేకుంటే అసలు, ఈ పేర్లే ఉండేవి కాదని బుక్కల్ నవాబ్ చెప్పడం గమనార్హం.

hanuma
bjp
bukkal nawab
Uttar Pradesh
cm
yogi adityanath
  • Loading...

More Telugu News