Nara Lokesh: ఆ విషయం అర్థమయ్యే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ దూరంగా ఉన్నారు: లక్ష్మీపార్వతి

  • నందమూరి కుటుంబాన్ని కరివేపాకులా బాబు వాడారు
  • లోకేష్ కు ‘కా’ అంటే ‘కీ’ రాదు
  • లోకేష్ ను సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నం

నందమూరి కుటుంబాన్ని కరివేపాకులా చంద్రబాబు వాడుకున్నారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆ విషయం అర్థమయ్యే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు దూరంగా ఉన్నారని విమర్శించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ పైనా ఆమె విమర్శలు గుప్పించారు. లోకేష్ కు ‘కా’ అంటే ‘కీ’ రాదని విమర్శించారు. నెలకు పది లక్షల ఖర్చుతో ట్యూషన్ పెట్టించి తెలుగు భాష నేర్పినా కూడా లోకేష్ నేర్చుకోలేకపోతున్నాడని, అతన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Nara Lokesh
Telugudesam
Chandrababu
lakshmi parvati
YSRCP
junior ntr
kalyanram
  • Loading...

More Telugu News