balakrishna: బాలయ్య కోసం ఇంకా కథ రెడీ చేయని బోయపాటి

- చరణ్ మూవీతో బిజీగా బోయపాటి
- వినాయక్ తో సెట్స్ పైకి బాలకృష్ణ
- నిర్మాతగా సి.కల్యాణ్
ప్రస్తుతం బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన 'మహానాయకుడు' విడుదలతో బాలకృష్ణ ఫ్రీ అవుతారు. ఆ తరువాత బాలకృష్ణ .. వినాయక్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ .. బోయపాటితోనే సినిమా చేయవలసి వుంది. కొత్తగా ఉండేలా తన మార్క్ కథను సిద్ధం చేయమని కొంతకాలం క్రితమే బాలకృష్ణ చెప్పారట.
