shivraj singh chouhan: పులి ఇంకా బతికే ఉంది.. నేను ఇక్కడే ఉన్నా!: శివరాజ్ సింగ్ చౌహాన్

  • తన నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెప్పిన శివరాజ్ సింగ్ చౌహాన్
  • ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా
  • నేను ఇక్కడే ఉన్నానంటూ వ్యాఖ్య

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రం 'టైగర్ జిందా హై' పేరు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నోటి నుంచి వచ్చింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పులి ఇంకా బతికే ఉందని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మీకు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... తాను ఇక్కడే ఉన్నానని... పులి బతికే ఉందని అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో 230 స్థానాలకు గాను కాంగ్రెస్ 114 సీట్లను గెలుచుకోగా బీజేపీ 109, బీఎస్పీ 2, సమాజ్ వాదీ పార్టీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. బీఎస్పీ, ఎస్పీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

shivraj singh chouhan
Madhya Pradesh
bjp
  • Loading...

More Telugu News