srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు కూడా హీరోగా వచ్చేస్తున్నాడు

  • ఈ నెల 24న గణేశ్ తొలి సినిమా లాంచ్
  • దర్శకుడిగా ఫణి పరిచయం 
  • త్వరలోనే పూర్తి వివరాలు

తొలి సినిమాతోనే మాస్ హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత కూడా స్టార్ హీరోయిన్స్ తో జోడీ కడుతూ భారీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కుర్రాడు గట్టి కసరత్తే చేస్తున్నాడు గానీ, ఇంతవరకూ సరైన హిట్ మాత్రం పడలేదని చెప్పాలి. ఈ ఏడాది వచ్చిన 'సాక్ష్యం'.. 'కవచం' ఆయనను మరో మెట్టుపైకి తీసుకెళ్లలేకపోయాయి. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన తమ్ముడైన బెల్లంకొండ గణేశ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పటివరకూ సొంత సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ వచ్చిన గణేశ్, హీరోగా కెమెరా ముందుకు వచ్చేస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఫణి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News