junior ntr: కేటీఆర్, ఎన్టీఆర్ కలయిక.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో

  • పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేసిన ఎన్టీఆర్
  • రాజకీయాలకు పూర్తిగా దూరం
  • ఓ ప్రైవేట్ పార్టీలో కలసిన కేటీఆర్, తారక్

తన సినీ కెరీర్ పై పూర్తిగా దృష్టిని కేంద్రీకరించిన జూనియర్ ఎన్టీఆర్... రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. కూకట్ పల్లి నుంచి తన సోదరి నందమూరి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగినా... ప్రచారానికి దూరంగానే ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ బిజీ వల్ల ప్రచారానికి రాలేకపోయాడు. మరోవైపు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలసి తారక్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ కలసినట్టు తెలుస్తోంది. అయితే, ఈ కలయిక ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు.


junior ntr
kct
photo
tollywood
TRS
  • Loading...

More Telugu News