kcr: రాహుల్ గాంధీ చేసిన పెద్ద తప్పిదం ఇదే: ఒవైసీ

  • పార్లమెంటు ఎన్నికల్లో నేను కేసీఆర్ తోనే ఉంటా
  • ఇప్పటి నుంచే కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నారు
  • ఏపీలో టీడీపీకి ముస్లింలు ఓటు వేయరు

త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. హంగ్ లోక్ సభ ఏర్పడుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో, ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ 120 సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమేనని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా తాను కేసీఆర్ తోనే ఉంటానని చెప్పారు. లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారని... జనవరి నుంచి ప్రచార రంగంలోకి దిగుతారని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు టీడీపీకి ఓటు వేయరని ఒవైసీ అన్నారు. ఎంఐఎంను బీజేపీ సీ-టీమ్ గా అభివర్ణించడం... బీజేపీ, టీఆర్ఎస్ ల నుంచి తాను డబ్బులు తీసుకున్నానని ఆరోపించడం రాహుల్ గాంధీ చేసిన పెద్ద తప్పిదమని చెప్పారు. ఇది ముస్లిం ఓటర్లపై ప్రభావం చూపిందని అన్నారు.

kcr
Rahul Gandhi
Asaduddin Owaisi
Andhra Pradesh
muslims
TRS
mim
congress
paliament
elections
  • Loading...

More Telugu News