Pune: వినాయకుడికి చలి పుడుతోందట... స్వెట్టర్ వేసి మంకీ క్యాప్ పెట్టిన భక్తులు!

  • పుణెలోని సారస్బాగ్ ఆలయంలో వింత ఆచారం
  • శీతాకాలంలో స్వామికి వెచ్చదనం కోసం స్వెట్టర్
  • సాయంత్రం వేసి, ఉదయాన్నే తొలగింపు

మనుషులకే కాదు... భగవంతుడికి కూడా చలికాలంలో వణుకు వస్తుందట. దీన్ని నమ్మే భక్తులు వినాయకుడికి వెచ్చదనాన్ని అందించడం కోసం స్వెట్టర్ వేసి, మంకీ క్యాప్ తగిలించారు. పుణెలో ఉన్న సారస్బాగ్ గణపతికి ప్రతి సంవత్సరం చలికాలంలో ఇలా చేయడం ఆనవాయితీ అట. గత 30 సంవత్సరాలుగా ఆలయ నిర్వాహకుడు శశికాంత్ ఇలా శీతాకాలంలో విగ్రహానికి ఉలెన్ క్యాప్, స్వెట్టర్ వేస్తుంటారట. సాయంత్రం కాగానే, వెచ్చగా ఉండేలా చూసి, ఆపై ఉదయాన్నే తొలగిస్తుంటారట. వారాన్ని బట్టి స్వామికి ధరింపజేసే స్వెట్టర్ రంగును మారుస్తుంటామని శశికాంత్ చెబుతున్నారు. కాగా, ఈ ఆలయం దాదాపు 250 సంవత్సరాల క్రితం నిర్మితం కాగా, ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

Pune
Sarasbag
Ganesh
Idol
Swetter
Cap
  • Loading...

More Telugu News