RTO: ఇకపై రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేస్తూ రెండుసార్లు పట్టుబడితే లైసెన్స్ శాశ్వతంగా రద్దు.. గుజరాత్‌లో కఠిన నిబంధనలు!
- రోడ్డుపై ఇక ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే
- ట్రాఫిక్ ఉల్లంఘనులకు కఠిన శిక్షలు
- ఆర్టీవో, పోలీసులు కలిసి అమలు
గుజరాత్‌లో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేయాలని రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో), ట్రాఫిక్ పోలీసులు కలిసి నిర్ణయం తీసుకున్నారు. రాంగ్‌రూట్‌లో డ్రైవ్ చేస్తూ రెండుసార్లు పట్టుబడిన వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని నిర్ణయించారు. మొదటి సారి పట్టుబడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు అతడి పేపర్లను ఆర్టీవోకు అప్పగిస్తారు. ఫలితంగా అధికారులు అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నుంచి ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తారు. రెండోసారి అదే తప్పు చేసి పట్టుబడితే ఈసారి పూర్తిగా అతడి లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దుచేస్తారు. అతడి పేరును బ్లాక్ లిస్టులో పెడతారు.