vijayasai reddy: ఆ విషయాన్ని ఎమ్మెల్యే చింతమనేని మరోసారి నిరూపించాడు: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబు ఎంత అసమర్థుడో చింతమనేనికి తెలుసు
  • తనను నిలువరించే దమ్ము బాబుకు లేదని నిరూపించాడు
  • టోల్ గేట్ సంఘటనే ఇందుకు నిదర్శనం   

గుంటూరు జిల్లాలో కాజా టోల్ ప్లాజా వద్ద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారును నిన్న అడ్డుకున్న సంగతి తెలిసిందే. టోల్ ఫీజును కట్టాలని చెప్పడంతో ఆగ్రహానికి లోనయిన చింతమనేని తన కారును అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

చంద్రబాబు ఎంత అసమర్థుడో చింతమనేనికి బాగా తెలుసని, తనను నిలువరించే దమ్మూధైర్యం ఆయనకు లేవని టోల్ గేట్ సాక్షిగా మరోసారి నిరూపించాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమరావతిలోని నీరుకొండపై దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ప్రకటించడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

vijayasai reddy
chintamaneni
prabhakar
Telugudesam
ysrcp
Chandrababu
  • Loading...

More Telugu News