ipl-2019: ఐపీఎల్ వేలంలో నన్నెందుకు విస్మరించారో!: మనోజ్ తివారీ ఆవేదన

  • నన్నెవరూ కొనుగోలు చేయకపోవడానికి కారణాలేంటి?
  • 2017 ఐపీఎల్ లో అవార్డులు సాధించా
  • వాటిని చూస్తుంటే ఏం తప్పు చేశానో నాకు తెలియట్లేదు!

రాజస్థాన్ వేదికగా ఐపీఎల్-12 సీజన్ కోసం ఆటగాళ్లను ఫ్రాంచైజీలు నిన్న కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ వేలంలో టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో, మనస్తాపం చెందిన మనోజ్ తివారీ తనను ఎవరూ కొనుగోలు చేయకపోవడానికి కారణాలేంటని ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా ఇంతవరకూ తాను సాధించిన రికార్డులను, ట్రోఫీలను ఆ పోస్ట్ ద్వారా పంచుకున్నాడు. భారత్ తరపున సెంచరీ సాధించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పొందిన తర్వాత వరుసగా తనను 14 మ్యాచ్ లలో తప్పించారని అన్నాడు. 2017 ఐపీఎల్ లో సాధించిన అవార్డులను చూస్తుంటే ఏం తప్పు చేశానో తనకు తెలియడం లేదంటూ మనోజ్ తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు.  

ipl-2019
team indai
cricketer
manoj tiwari
  • Loading...

More Telugu News