dhoni: భారత క్రికెటర్లలో గొప్ప ఆటగాడు ధోనీ: కపిల్ దేవ్

  • 2011లో ధోనీ సేన ప్రపంచకప్ సాధించింది
  • 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది
  • యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకే టెస్టుల నుంచి తప్పుకున్నాడు

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసలు కురిపించారు. భారత క్రికెటర్లలో ధోనీయే గొప్ప ఆటగాడని కితాబిచ్చారు. 2011లో ధోనీ సేన అద్భుతంగా రాణించి ప్రపంచ కప్ ను సాధించిందని చెప్పారు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్ ను కూడా గెలుపొందిందని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ లో ధోనీ ఆడతాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ధోనీ 90 టెస్ట్ మ్యాచులు ఆడాడని... యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చేందుకు టెస్టుల నుంచి తప్పుకున్నాడని చెప్పారు. 

dhoni
kapil dev
team india
best player
  • Loading...

More Telugu News