kcr: బీసీల విషయంలో కేసీఆర్ చారిత్రక తప్పిదం చేస్తున్నారు: పొన్నాల లక్ష్మయ్య
- బీసీల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు
- బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలి
- పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
బీసీల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాదులో ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డినెన్స్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల విషయంలో కేసీఆర్ చారిత్రక తప్పిదం చేస్తున్నారని అన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలోని 119 సీట్లలో 34 సీట్లను బీసీలకు కేటాయించామని చెప్పారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ, బీసీల రిజర్వేషన్లు పెంచాలని కోరారు. రేపు తలపెట్టిన ధర్నాకు టీడీపీ మద్దతు ఉంటుందని చెప్పారు.